V1News Telangana

best news portal development company in india

అంగన్వాడి కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో నీటి సమస్యకు మోక్షం కలిగించిన ఎమ్మెల్యే……

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడి కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( పిహెచ్ సి) నూతన భవనాలు నిర్మించిన నాటినుండి నీటి వసతి లేకపోవడం వలన వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇరుగుపొరుగు వాళ్ల దగ్గర నుండి మరియు కుళాయిల ద్వారా నీటిని సమకూర్చుకొని సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ సమస్య పరిష్కారానికి వారు కృషి చేయలేదు. చివరికి నియోజకవర్గ ఎమ్మెల్యే.. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి నసురుల్లాబాద్ గ్రామ మాజీ ఎంపిటిసి కంది మల్లేష్ ను పిలిపించుకొని అంగన్వాడీ కేంద్రం వద్ద బోరు వేయించి వారికి త్వరితగతిన నీటి వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం రోజు బోర్ వెల్స్ బండిని పిలిపించి అంగన్వాడీ కేంద్రం టీచర్ గౌరమ్మ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (MLHP) జవాదుద్దీన్ చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించి బోర్ బావి తవ్వించారు. చాలాకాలంగా తాము ఎదుర్కొంటున్న నీటి వసతి సమస్యను పరిష్కరించడానికి బోరు వేయించినందుకు అంగన్వాడి కేంద్రం సిబ్బంది మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఏఎన్ఎం వెంకటలక్ష్మి, లావణ్య, నవంతిక, నాయకులు దంతూరి మైశా గౌడ్, వనం వెంకటేశ్వర్ రావ్, బొడిగె భాను ప్రకాష్ గౌడ్, తోట వార్ భూమేష్, అన్వర్, మల్లేష్ , మైలారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india