*ఎస్.సి.టి.పి.సిల స్పోర్ట్స్ మీట్ – 2024 ను ప్రారంభించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్..
నేడు ఎడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్కంపేట్ గ్రామశివారులో గల నిజామాబాద్ కమీషనరేటు పోలీస్ శిక్షణ కేంద్రంలో స్టయిపాండరీ క్యాడెటు ట్రేయిని కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ కాలంలో భాగంగా ” *స్పోర్ట్స్ మీట్ 2024*” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా *నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీమతి సి.హెచ్. సింధుశర్మ, ఐ.పి.యస్*., గారు హజరుకావడం జరిగింది.
మొదటగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ గారు పరేడ్ గౌరవ వందనం స్వీకరించి, పతాకావిష్కరణ చేసి, జ్యోతి వ్రజ్వాలన అనంతరం శాంతి పావురాలను ఎగురవేసి ఈ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించడం జరిగింది.
మన పోలీస్ విభాగంలో విధినిర్వాహణలో క్రీడలు అనేవి ఎంతో అవసరమైనవని, మనం అందరం ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుంది అని, మనకు ఎన్నో రకాల వస్తాయని వాటి నుండి మన శ్యాంతి పొందాలంటే క్రీడలు ఎంతో అవసరం అనియు, అట్టి క్రీడల కోసం ప్రతి ఒక్కరు కొంత సమయం కేటాయించాలని, ఇక్కడ శిక్షణ పొందుతున్న సిబ్బందిలో ఎంతో మంది మంచి క్రీడాకారులు ఉన్నారని, వారు ఇంకా మంచి నైపుణ్యతగావించి జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం కృషి చేయాలని, ప్రస్తుతం ఈ సి.టి.సి యందు సైబరాబాద్ నుండి వచ్చిన 250 మంది ట్రెయినింగ్ తీసుకుంటున్నారని కావున అందరి దృష్టి సైబరాబాద్ మీద ఉంటుంది కావున ఈ శిక్షణ కాలంలో మంచి ” క్రమశిక్షణతో ” కూడిన శిక్షణను ఇవ్వడం జరుగుతుందని, మీకు ఎలాంటి క్రీడల యందు శ్రద్ధ ఉంటే వాటిలో ముందంజలో ఉండడానికి కృషి చేయాలని , ప్రతీ ఒక్కరికి ఆరోగ్యమే మహబాగ్యం కోసం కృషి చేయాలని ప్రతీ ఒక్కరికి వారి వారి జీవన శైలీలో ఎన్నోరకాల మార్పులు వచ్చాయని, వారి ఆహరపు అలవాట్లలో కూడా ఎన్నోరకాల మార్పులు వచ్చాయని, పోలీస్ వృత్తి అనేది ఒక టీమ్ వర్క్ గా విధులు నిర్వహించాల్సి వస్తుందని, ఈ టీమ్ వర్క్ అనేది ముఖ్యంగా ఈ క్రీడల వలన వస్తుందని అన్నారు.
*ముందుగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ గారు వాలీబాల్ క్రీడలను ను ప్రారంభించడం జరిగింది*.
ఈ సందర్భంగా అదనపు డి.సి.పి ( ఎల్ అండ్ ఓ ) శ్రీ జి. బస్వారెడ్డి, సి.టి.సి ఎ.సి.పి ( వైస్ ప్రిన్సిపాల్ ) శ్రీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పి శ్రీ ఎస్. శ్రీనివాస్ రావ్, ఎ.ఆర్ ఎ.సి.పి శ్రీ నాగయ్య, బోధన్ ఎ.సి.పి శ్రీ పి. శ్రీనివాస్, సి.ఐ శ్రీ శివరాం, ఆర్.ఐ శ్రీ శ్రీపాల్ మరియు రిజర్వు ఇన్స్పెక్టర్, ఆర్.ఎస్.ఐలు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








