V1News Telangana

best news portal development company in india

గుత్తేదారు అత్యుత్సాహం…..

SHARE:

– శంకుస్థాపన జరిగిన రోజు నుండి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిన వైనం

– రాత్రి పగలు తేడా లేకుండా కూలీలతో పనులు …

– గుంతల నడుమ నడుస్తున్న చిన్నారులు

– ప్రమాదం జరిగితే మా కేంటనట్లు వ్యవహరిస్తున్న గుత్తేదారు పనితీరు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు.. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసిన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి) భవన నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయితే ఈ భవన నిర్మాణ పనులు రాత్రి పగలు తేడా లేకుండా గుత్తేదారు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు పలువురు మాట్లాడుకుంటున్నారు. సోమవారం రోజు చీకట్లో సైతం కూలీలతో పిల్లర్ గుంతలలో పుట్టింగ్ లు వేయిస్తున్నారు. అయితే ఈ గుంతల మధ్యలో కూలీల చిన్న పిల్లలు తిరుగుతుండడం గమనార్హం.. మహిళ కూలీలు సైతం చీకట్లో నడవడానికి ప్రమాదకరంగా ఉన్నా కూడా గుత్తేదారు పనులు చేయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పని జరుగుతున్న చోట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడం వలన కారు చీకట్లు కమ్ముకున్న ప్రదేశంలో ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అయినా కూడా చీకటి పడిన తర్వాత గుత్తేదారు పనులు నిలిపివేయకపోవడం విడ్డూరం. స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్ద తమ పేరును నిలుపుకోవడానికి రాత్రి పగలు తేడా లేకుండా పనులు నిర్వహిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు వేగంగా పూర్తి చేసి ఆసుపత్రి భవనాన్ని అందించాలన్న కుతూహలంతో ప్రమాదకర స్థాయిలో పనులు జరిపిస్తున్నారు. అయితే నాయకుల మెప్పు పొందడం కోసం శ్రమజీవుల యొక్క శ్రమను దోపిడీ చేసి వారి జీవితాలతో, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఉద్యోగి అయినా సాయంత్రం వరకు పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుతారు. కానీ నసురుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం వద్ద మాత్రం కారు చీకట్లు కమ్ముకున్న కూడా పనులు చేస్తున్నారు. దీనిపై సదరు గుత్తేదారును వివరణ కోరగా మధ్యాహ్నం సమయంలో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా లేకపోవడం వలన కూలీల భారం పైన పడుతుందని.. చీకటి పడిన తర్వాత కూడా పని చేయించవలసి వస్తుందని తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india