Post Views: 109
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల షెడ్యూల్డ్ తెగల (ఎస్టి) బాలుర వసతి గృహాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఆదివారం రోజు ఉదయం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలో మౌలిక సదుపాయాలను పరిశీలించి.. విద్యార్థులతో కలిసి అల్పాహారం భుజించారు. విద్యార్థులతో కాసేపు చర్చించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలు తలెత్తిన తన క్యాంప్ ఆఫీసుకు సమాచారం అందించినట్లయితే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








