V1News Telangana

best news portal development company in india

రాజన్న రాజ్యంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఎన్నో ఏళ్ల వ్యాపార జీవితాలు రోడ్డున పడతాయా? తొలగించిన వ్యాపారస్తుల షాపులను మరో చోట నిర్వహించేలా కృషి చేయాలి? రోడ్డు వెడల్పు లేకున్నా అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్య ఉంటుందా?

SHARE:

రాజన్న రాజ్యంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా?

ఎన్నో ఏళ్ల వ్యాపార జీవితాలు రోడ్డున పడతాయా?

తొలగించిన వ్యాపారస్తుల షాపులను మరో చోట నిర్వహించేలా కృషి చేయాలి?

రోడ్డు వెడల్పు లేకున్నా అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్య ఉంటుందా?

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 19:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రుడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నగరంలో ఉన్న చిరు వ్యాపారస్తుల షెటర్లను మరియు ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుల దుకాణాలపై జరుగుతున్న చర్యలో రామగుండం ప్రజానీకం అసంతృప్తి చెందుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పట్ల రామగుండం ప్రజలు మార్పు కోరిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు అనుకున్నట్లు జరగకపోవడం ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది. రామగుండంలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ దానిపై లేని శ్రద్ధ చిరు వ్యాపారస్తుల పై చూపించడం ప్రశ్నార్థకంగా మారింది. రాజన్న ప్రభుత్వం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల నడవడికను చిరు వ్యాపారస్తుల జీవనం రోడ్డు పాలు అయిందని అనేక ప్రశ్నలు వెలివేస్తున్నారు. అయినప్పటికీ రాజన్న ప్రభుత్వం వస్తే ప్రజలు బాగుపడతారని ఆశతో ఓట్లు వేస్తే తీరా వారి నోటికాడి ముద్ద లాక్కున్నట్టు అయిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని జూబ్లీహిల్స్ గా పిలిచే మార్కండేయ కాలనీలో సరైన రోడ్డు వెడల్పు లేకున్నా అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్య ఉంటుందా ఇలాంటి నిర్మాణాలపై కూడా ఇదే తరహాలో చర్య ఉంటుందా అని ప్రశ్నలు వెలువడుతున్నాయి. చిరు వ్యాపారస్తులు నగర కూడలిలో ఎన్నో ఎలాగా వారి వ్యాపారాలపై ఆధారపడి వారి జీవనం సాగిస్తున్నారు అయితే అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు అధికారులు చేస్తున్న తీరుపై కనీసం ఎలాంటి సమాచారం నోటీసులు ఇవ్వకుండా వారి షాపులను తొలగించడం పై ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన దుకాణాల వ్యాపారస్తులకు న్యాయం చేయాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. జరిగే అభివృద్ధి మంచికో చెడుకో తెలియదు కానీ ఎన్నో ఏళ్ల వ్యాపార జీవితం కోల్పోయి అనేకమంది రోడ్డున పడే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. నగరంలో గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కేవలం రోడ్డు వెడల్పు ఒక్కటే కనిపిస్తున్నాను అనేకమంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పుడున్న రాజకీయ నేతలు అధికారులు ఆలోచన చేసి కూలిపోయిన వ్యాపారస్తులకు మరో చోట వ్యాపారం కొనసాగేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india