V1News Telangana

best news portal development company in india

విదేశం పంపుతానని నలుగురు యువకులకు మోసం చేసి 4లక్షలు నోకేసిన ఏజెంట్…… బోధన్ లో ముగ్గురు రుద్రూర్ లో ఒకరు….. మాకు న్యాయం చేయండి సార్లు అంటూ పోలీస్ స్టేషన్ ల చక్కర్లు కొడుతున్నా యువకులు….

SHARE:

యూరప్ పంపుతానని బోధన్ పట్టణానికి చెందిన ఓ ఏజెంట్ కష్టం చేసే యువకులకు మోసం చేసాడు. 2023 డిసెంబర్ నెలలో నలుగురు యువకుల దగ్గర వచ్చి వారి దగ్గర నుంచి 4లక్షలకు పైగా డబ్బులు తీసుకొని వారికి ఐర్లాండ్ వీసా ఉందని రెండు నెలలో ఐర్లాండ్ పంపిస్తానని ఇంటికి వచ్చి మరి డబ్బులు తీసుకెళ్లాడు.

డబ్బులు ఇచ్చినా వారందరు పేద కుటుంబాలకు చెందినవారే వడ్డీ తో డబ్బులు తీసుకొచ్చి ఏజెంట్ కు ఇచ్చారు. తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అనే ఆశతో వారి తల్లి తండ్రులు ఏజెంట్ చేతుకి డబ్బులు ఇచ్చారు కొన్ని డబ్బులు ఫోన్ పే గూగుల్ పే లో కొట్టారు. బయట పంపిస్తానని డబ్బులు తీసుకునెప్పుడు అగ్రిమెంట్ చేసిన పత్రాలు కూడా వీరి వద్ద ఉన్నాయి. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని చేపిన కొన్ని రోజులు విని ఫోన్ స్విచ్ అఫ్ చేసి ఆ ఏజెంట్ ప్రస్తుతం పరరిలో ఉన్నాడు. ఏజెంట్ తండ్రికి తమ డబ్బులు ఇవ్వాలి అని ఎన్ని సార్లు బ్రతిమలిన కొడుకు తో తనకు సంబంధం లేదంటు సమాధానలు ఇస్తున్నాడని మోసపోయిన యువకులు తెలిపారు. పోలీస్ వ్యవస్థ పైన తమకు నమ్మకం ఉందని వారే మాకు న్యాయం చేయాలనీ నిజామాబాద్ కమిషనర్ సింగిన్వార్ కలమేశ్వర్ దీని పైన ప్రత్యేక ద్రుష్టి సారించి తమకు న్యాయం చేయాలనీ డబ్బులిచ్చి మోసపోయిన యువకులు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india