V1News Telangana

best news portal development company in india

నసురుల్లాబాద్ గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ముగ్గులు వేసి దీపాలతో అందంగా అలంకరించిన భక్తులు….

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో యువజన దుర్గ భవాని కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన సందర్భంగా మాలధారణ భవానీలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో అందంగా ముగ్గులు వేసి దీపాలను వెలిగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీపాల కాంతులలో అమ్మవారు శోభాయమానంగా భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా గురు స్వామి కొని సాయ గౌడ్ మాట్లాడుతూ అమ్మవారు అవతారం సందర్భంగా దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి సన్నిధిలో అందంగా ముగ్గులు వేసి దీపాలంకరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతినిత్యం కుంకుమార్చన కార్యక్రమాలు, అభిషేకాలు ,ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. గత 8 సంవత్సరాల నుండి అమ్మవారిని నిలుపుకుంటూ పూజించుకుంటున్నామని తెలిపారు. అమ్మవారి అన్నపూర్ణ దేవి అవతారం రోజు హోమం మరియు కుంకుమార్చనలు, అన్నసంతార్పణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. యువకులందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారి మాల ధరించి ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగడం అభినందించాల్సిన విషయం అన్నారు. అమ్మవారిని నిలుపుకొని ఇంత అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి సహకరిస్తున్న యువజన దుర్గాభవాని కమిటీ యువకులందరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు గుత్తుల శ్రీనివాస్, జనపల సాయిలు, భోధనం రమేష్ యాదవ్, శ్రావణ్ గౌడ్, రాఘవ, శ్రీనివాస్ రెడ్డి, కాశీనాథ్, హరీష్ యాదవ్, తర్ణం శ్రీను, మధు, ఉల్లెంగ సాయికుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india