Post Views: 88
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల యువభారత్ దుర్గాభవాని కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించి పూజిస్తున్న అమ్మవారిని మంగళవారం రోజు లక్ష్మీదేవి అవతారం సందర్భంగా డబ్బులతో అందంగా అలంకరించారు. లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువభారత్ యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








