V1News Telangana

best news portal development company in india

ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

SHARE:

ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 06:-

రామగుండం / గోదావరిఖని ప్రాంతంలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్గదర్శకులు నరహరి ఐ ఎ ఎస్ ఆదేశాల మేరకు ఆదివారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 32వ డివిజన్ లో కార్పొరేటర్ అయిత శివకుమార్ ఆధ్వర్యంలో ఉచిత కమిటీ శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో భాగంగా ముఖ్యఅతిథిగా

ఆర్ జి 1 జి ఏం లలిత్, సిద్ధార్థ హైహ్ స్కూల్ డైరెక్టర్ విజయఆనంద్ మరియు అన్ని స్వచ్ఛంద సంఘాలు పాల్గొన్నారు.

ఈ యొక్క ఉచిత శిబిరానికి దాదాపు 400 మంది హాజరైనట్లు తెలిపారు. వీరిలో 220 మందికి పైగా ఉచితంగా ఆపరేషన్ దసరా పండగ తర్వాత హైదరాబాదులోని శంకర శంకర ఐ విజయన్ సెంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేయడం జరుగుతుందని తెలియజేశారు.

అనంతరం స్వచ్ఛంద సంఘాలు 32వ డివిజన్ కార్పొరేటర్ కి శాలువా కప్పి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. అలాగే గత 20 సంవత్సరాల నుండి ప్రెస్ క్లబ్ లో పనిచేస్తున్నటువంటి దస్తగిరి ఆఫీస్ బాయ్ కి అనారోగ్య కారణం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని వారికి ఆలయ ఫౌండేషన్ తరపున విజయఆనంద్ చేతుల మీదుగా 50 కిలోల రైస్ బాగ్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు అయిత దేవా పల్లె ప్రశాంత్ పల్లె క్రాంతి కుమార్ మరియు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india