V1News Telangana

best news portal development company in india

గ్రామాల అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తా -ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

SHARE:

గ్రామాల అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తా –-ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

(V1 న్యూస్ ప్రతినిధి) రామగుండం / అంతర్గం అక్టోబర్ :-3

గ్రామాల అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తా గ్రామాలలో అన్ని సదుపాయాలకు కనిపించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం అంతరంగ మండలం లింగాపూర్ గ్రామంలో సింగరేణి నిధులు నాలుగు కోట్ల నుంచి 87.6 ఆరు లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు ఆర్వో ప్లాంట్ బయో టాయిలెట్స్ ఓపెన్ జిమ్ స్కూల్ రేణి రేషన్ నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించి మాట్లాడారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన కోసం శ్రమిస్తున్నామని అందులో భాగంగానే రామగుండం పట్టణంలో 800

మెగావట్ల సామర్థ్యం గల నూతన విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్న ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పరిశ్రమలకు కావలసిన బొగ్గు నీరు భూమి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా

వ్యవహరించిందని ఫలితంగా నూతన విద్యుత్ ప్లాంటు రాలేదని గుర్తు చేశారు. గత బి ఆర్ ఎస్ సర్కారు ప్రభుత్వ ఖజానాను గుల్ల చేసిందని అందుకే ప్రజలు బొంద పెట్టారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా మన కాంగ్రెస్ సర్కారు చేస్తుందని అన్నారు.

ఇచ్చిన గ్యారంటీ ప్రకారం మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు సౌకర్యం ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 500 కే గ్యాస్ రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే రాజు ఠాగూర్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన తీరును గమనించాల్సిన అవసరం ఉందని అసత్య ప్రచారం చేస్తున్న గత పాలకులకు వ్యక్తులకు శక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. రైతులకు రుణమాఫీ జరగలేదని ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని అండగా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళమని తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. కొన్ని బ్యాంకులలో చిన్నచిన్న లోపాల వల్ల రుణమాఫీ ఆగిందని అందరికీ త్వరలోనే మన ప్రభుత్వం పూర్తి చేస్తుందని పూర్తి చేయిస్తామని భరోసా ఇస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజాపాలన ప్రజల కోసమే పనిచేస్తుందని మనందరం కలిసికట్టుగా సమస్యలు పరిష్కారం కోసం సమిష్టి నిర్ణయాలతో కదులుదామని ప్రతి పల్లె ప్రతి పట్టణం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే లక్ష్యంగా సాగుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్ జి వన్ జిఎం లలిత్ కుమార్ మాజీ కార్పొరేటర్లు అధికారులు కాంగ్రెస్ అనుబంధం సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india