V1News Telangana

best news portal development company in india

ఓటరు జాబితాలో ఏర్పడిన అవకతవకలు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టిన గ్రామస్తులు…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో ప్రజలు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే సంగం గ్రామాన్ని రెవెన్యూ శాఖ నియమాల ప్రకారం జనాభా ప్రాతిపదికన సంగం గ్రామాన్ని ఒక గ్రామ పంచాయతీగా మరియు సంగం( ఎ) గ్రామాన్ని ఇంకొక గ్రామ పంచాయతీగా విభజించారు. అయితే గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో నివసించే ప్రజలకు ఓటరు నమోదు జాబితాలో అవకతవకలు జరిగాయని వారు మంగళవారం రోజు గ్రామపంచాయతీ ముందు నిరసన తెలిపారు. దీంతో గ్రామంలో గల ఎస్టి వర్గానికి చెందిన ప్రజలకు ఓ గ్రామ పంచాయతీ.. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలకు ఒక గ్రామ పంచాయతీ ఏర్పడాలని గ్రామస్తులందరూ అధికారుల సమక్షంలో తీర్మానించారు. అయినప్పటికీ విభజన చేసే క్రమంలో పలు ఒక తవకలు జరగడం వలన మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. భవిష్యత్తులో బ్యాంకు లోన్లు మరియు మరే ఇతర అవసరాలలో మాకు ఇబ్బందులు తలెత్తుతాయేమోనని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ఎంపీడీవో సూర్యకాంత్ ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ ప్రజల అభిప్రాయాలను మరియు తీర్మానాలను సేకరించిన తర్వాతనే గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విడగొట్టామని తెలిపారు. ఈ క్రమంలో ఓటరు జాబితాలో స్వల్ప అవకతవకలు జరిగి ఉండొచ్చని అన్నారు. వాటిని సరిచేసే అధికారం మా పరిధిలో ఉండదని.. ఆర్డీవో అధికారి స్థాయిలో ఉంటుందని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని.. మళ్లీ ఓటరు నమోదు జాబితా ప్రక్రియ ఆదేశాలు వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించే విధంగా శక్తి మేరకు సహకరిస్తామని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india