V1News Telangana

best news portal development company in india

రాజ్యమేలుతున్న అక్రమ ఇసుక మాఫియా….. -ఈ అక్రమాలను అడ్డుకునే వారే లేరా ? -రోజురోజుకు మితిమీరిపోతున్న మాఫియా ఆగడాలు.. -రెవెన్యూ శాఖఅధికారులపై దాడి చేసేంత అండదండలు ఎవరిస్తున్నారు….? -పోలీసు అధికారుల మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది ప్రాణాలకు భరోసా ఎవరిస్తారు?

SHARE:

నిజామాబాద్ జిల్లా: సాలూర మండలంలోని హున్సా, మందర్న, ఖాజాపూర్, సాలూర తదితర మంజీరా పరివాహక గ్రామాల నుండి ఇసుక మాఫియా దారులు అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా యదేచ్చగా మంజీరా నది నుండి ఇసుకను బకాసురుల్లాగా తోడుకుంటూ ట్రాక్టర్లలో, టిప్పర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలకు కూడా తావిచ్చినట్లు అవుతుంది. ఇసుక పంట పొలాలపై పడడం వలన పంటలు కూడా దెబ్బతింటున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామాల ప్రజలు ఏ సమయంలోనైనా రోడ్డు మార్గాల గుండా ప్రయాణించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. సామాన్య ప్రజలను బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని.. రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రశ్నించగా రెవెన్యూ శాఖ వీఆర్ఏ పైన విచక్షణారహితంగా దాడి చేసి . చివరికి వీఆర్ఏ ఇసుక టిప్పర్ ను అడ్డుకొని ఆపాలని ప్రయత్నించగా వారు అక్కడి నుండి పారిపోయారు. తర్వాత ఇసుక మాఫియా దారులు టిప్పర్ లో ఉన్న ఇసుకను ట్రాలీ ఆటోల ద్వారా ఖాళీ చేయించుకొని చివరికి టిప్పర్ ను కూడా అక్కడ కనబడకుండా చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం వలన ప్రజలు ఇసుక మాఫియా దారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనార్జనకు అలవాటు పడి ప్రజలపై మరియు అధికారులపై దాడులు జరుపుతూ ఇంత ఘోరాలకు పాల్పడుతున్నప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సామాన్య ప్రజలపై నే కాకుండా రెవెన్యూ శాఖ అధికారులపై కూడా దాడులు జరిపితే పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులను వదిలిపెట్టి రాత్రనక, పగలనక విధులు నిర్వహిస్తున్న వారి ప్రాణాలకు భరోసా ఇచ్చేది ఎవరు అని.. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేవారే లేరా అని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమ ఇసుక మాఫియాదారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులకు అందరికీ రక్షణ కల్పించే విధంగా అక్రమ ఇసుక రవాణాను అరికట్టి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india