V1News Telangana

best news portal development company in india

మజీద్ కొరకు కేటాయించిన భూమిని స్వాహా చేసిన మైనారిటీ వర్గానికి చెందిన పాత్రికేయుడు…..

SHARE:

బోధన్ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సమీపంలో గత ప్రభుత్వ హయాంలో మైనారిటీ సోదరులకు మసీదు నిర్మాణం కొరకు కేటాయించిన భూమిని పట్టణంలో గల మైనారిటీ వర్గానికి చెందిన ఒక పాత్రికేయుడు వారి మత పెద్దలకు విషయం తెలియకుండా వారితో సంతకాలు చేయించుకుని.. మరికొన్ని సంతకాలు ఫోర్జరీ చేసి సదరు భూమిని పట్టా చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ భూమిని ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు.

చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రోజురోజుకు ఆ పాత్రికేయుడి ఆగడాలకు అంతేలేకుండా పోతుంది. మసీదు నిర్మాణం కొరకు కేటాయించిన స్థలాన్ని స్వాహా చేసినప్పటికీ మైనారిటీ వర్గానికి చెందిన మత పెద్దలు మరియు సభ్యులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మరియు సబ్ కలెక్టర్ గారు ఈ సంఘటనపై వెంటనే స్పందించి బెదిరింపులకు పాల్పడుతూ చట్ట వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాత్రికేయుడిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని తిరిగి ఆ భూమిని మసీదు నిర్మాణానికి కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ప్రజల సంక్షేమం కొరకు వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపించే విధంగా దోహదపడే పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతూ పాత్రికేయ రంగానికి కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించే ఇలాంటి భూ బకాసురుని ఆగడాలను.

V1 న్యూస్ ద్వారా రోజుకొకటి చొప్పున ప్రజలు తెలుసుకోవచ్చు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india