-వృత్తిరీత్యా లెక్చరర్ అయిన కరాటే శిక్షకుడిగా ప్రత్యేకత చాటుకుంటున్న వైనం
V1న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: వృత్తిరీత్యా లెక్చరర్ కావడం వలన అశోక్ విద్యార్థులకు చదువు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన తాను చదివిన చదువుతో బోధన్ డివిజన్ కేంద్రంలో లెక్చరర్ గా స్థిరపడి బీఈడీ మరియు ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ బిజీ బిజీగా జీవితం గడుపుతున్నారు. అయితే తాను చిన్నతనంలో నేర్చుకున్న కరాటే విద్యను మర్చిపోకుండా.. విద్యార్థులకు చిన్నప్పటినుండే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా కరాటే విద్య దోహదపడుతుందని ముఖ్యంగా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని బాలికలకు సమాజంలో దుండగులు, ఆకతాయిలు, పోకిరీల భారీ నుండి తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణలో దోహదపడే విధంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నసురుల్లాబాద్ మండలం లోని దుర్కి గ్రామంలో గల గురుకుల బాలికల పాఠశాలలో కరాటే విద్య లో శిక్షణ అందిస్తున్నారు. వివిధ పాఠశాలల్లో మరియు హాస్టళ్లను ఎంచుకొని విద్యార్థులకు కరాటే శిక్షణలో మెలకువలు క్రమం తప్పకుండా నేర్పిస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా మాస్టర్ సూచించే మెలకువలను ఆసక్తిగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. లెక్చరర్ గా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే అదేవిధంగా అంకితభావంతో కరాటే విద్య శిక్షకుడిగా కూడా రాణిస్తూ విద్యార్థులను కరాటేలో రాటు తేలుస్తున్నందుకు లెక్చరర్ అశోక్ ను పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ఇంకా ఎంతో మంది విద్యార్థులకు కరాటే శిక్షణలో మెలకువలు నేర్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








