అలాట్మెంట్ లేదు
అనుమతులు లేవు
సీజన్ అసలే కాదు
అయినా పాత వరి ధాన్యం, దాచిన ధాన్యం, టాటా ఆటో వాహనాల్లో కోటగిరి ఎత్తుండా రోడ్డు నుంచి హుమ్నాపూర్ తో పాటు ఇతర రైస్ మిల్లకు చేరవేత
నిబంధనం తుంగలో పెట్టి పాత వరి ధాన్యం ఇతర రైస్ మిల్లకు చేరవేత
పట్టించుకోని అధికారులు…

కోటగిరి
అలాట్మెంట్ లేదు ,అనుమతులు లేవు, అయినా ధాన్యం కోటగిరి మండలం నుంచి వర్ని మండలంకు చేరుతుంది, సీజన్ కూడా అసలే కాదు, పాత వరి ధాన్యం మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా ట్రాలీ ఆటోలలో కోటగిరి మండల కేంద్రం ఎత్తుండా రోడ్డు పక్కనే ఉన్న పలు రైస్ మిల్ల నుంచి వర్ని మండల తో పాటు ఇతర మండలంలో ఉన్న రైస్మిల్లకు తరలుతుంది, నిబంధనకు విరుద్ధంగా ఆ విధంగా పాత వరి ధాన్యం తరలరాదు, కానీ ధాన్యం మాత్రం తర్లుతుంది ధాన్యం తరలి విషయంలో ఎలాంటి పత్రాలు లేవు,
అయినా ధాన్యం మాత్రం దర్జాగా తరలిపోతుంది ఎవరు పట్టించుకోవడం లేదు, ఈ సందర్భంగా కోటగిరి ఎమ్మార్వోను వివరణ కోరగా ధాన్యం అలా తరలిపోరాదని దానిపై విచారణ చేస్తామని ఇప్పుడే సిబ్బందిని పంపిస్తున్నామని సమాధానం ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








