Post Views: 104
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బైరాపూర్ మరియు మల్లాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది లబ్ధిదారులు మాజీ జెడ్పిటిసి స్వరూప శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు బీర్కూర్ మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టా ధ్రువ పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారు తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాధితులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








