-రసానిక ఎరువుల ప్రభావం వలన కూలీలు మరణిస్తున్నారు
-డ్రోన్ పరికరం ద్వారా ఐదు నిమిషాల వ్యవధిలో ఎకరం పొలానికి ద్రావణాన్ని పిచికారి చేయవచ్చు
-ఒకరోజు వ్యవధిలో 25 నుండి 30 ఎకరాల వరకు ద్రావణాన్ని చల్లవచ్చు
-డ్రోన్ పరికరం సేవలను రైతులందరూ వినియోగించుకోవాలి
-శ్రావణ్ గౌడ్ ను అభినందించిన స్థానిక రైతులు మరియు గ్రామ ప్రజలు
-యువ రైతు కూని శ్రావణ్ గౌడ్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు యువ రైతు మరియు ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకుడు కూని శ్రావణ్ గౌడ్ రైతులకు వ్యవసాయ పంటలకు రసాయనిక ఎరువులు పిచికారి చేయడానికి కూలీల బెడద మరియు అధిక పెట్టుబడి భారం తగ్గించే క్రమంలో డ్రోన్ పరికరం ద్వారా పిచికారి చేసే పరికరాన్ని హైదరాబాద్ నుండి కొనుగోలు చేసి మండల కేంద్రంలో గల వ్యవసాయ పంట పొలాలలో రైతుల సమక్షంలో మరియు ఉప తహసిల్దార్ బావయ్య ఆధ్వర్యంలో ప్రారంభించి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలో డ్రోన్ పరికరం ద్వారా పంట పొలాలపై రసాయనిక ద్రావణాన్ని పిచికారి చేసి దగ్గరుండి గమనించారు. ఈ సందర్భంగా కూని శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ డ్రోన్ పరికరాన్ని హైదరాబాద్ నుండి కొనుగోలు చేశామని తెలిపారు. ఈ డ్రోన్ పరికరం ద్వారా ఐదు నిమిషాల వ్యవధిలో ఒక ఎకరం పొలానికి రసాయనిక ఎరువులను పిచికారి చేయగలుగుతామని అన్నారు. ఈ పరికరానికి ఉపయోగించి ఒకరోజు వ్యవధిలో దాదాపు 25 నుండి 30 ఎకరాల వరకు ద్రావణాన్ని పిచికారి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. డ్రోన్ పరికరం ద్వారా స్త్రీ చేయడం వలన తక్కువ మోతాదులో రసాయనిక ద్రావణాన్ని తీసుకొని ఎక్కువ మోతాదులో నీటిని వినియోగించి పంటలపై సమాంతరంగా పిచికారి చేయడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఒకసారి సిస్టంలో పంట పొలం యొక్క సరిహద్దులను పొందుపరిచినట్లయితే డ్రోన్ పరికరం ద్రావణాన్ని చల్లుకుంటూ క్రమ పద్ధతిలో దాని పనిని అది నిర్వర్తిస్తుందని తెలిపారు. కూలీల ద్వారా రసాయనిక ఎరువులను పిచికారి చేయించడం వలన రసాయనిక ఎరువుల ప్రభావం వలన కొంతమంది మరణించడం జరుగుతుందని మరియు సరైన సమయానికి కూలీలు దొరకక పోవడం వలన పంట పొలాల్లు దెబ్బతింటున్నాయని.. అదేవిధంగా కూలీల ద్వారా ఎరువులు చదివించడం వలన ఎక్కువ మొత్తంలో డబ్బు మరియు సమయం వృధా అవుతుందని దీనివలన రైతులపై పెట్టుబడి భారం చాలా ఎక్కువ అవుతుందని అన్నారు. అందువల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారికి కొంతవరకు చేయూత అందించినట్లు అవుతుందని ఈ పరికరాన్ని కొనుగోలు చేశామని తెలియజేశారు. శ్రీ దుర్గా ఫర్టిలైజర్స్ దుకాణం మరియు ఏజెన్సీ ద్వారా వారి స్వంత వ్యవసాయ పనులకు మరియు రైతులకు కూడా సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. గ్రామంలో గల రైతులు మరియు మండల వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ డ్రోన్ పరికరం ద్వారా రసాయనిక ఎరువులు పిచికారి చేసుకునే సేవలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు అరిగె సాయిలు మరియు అయినాల లింగం తదితరులు మాట్లాడుతూ యువ రైతు శ్రావణ్ గౌడ్ ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయసులో రైతుల యొక్క ఇబ్బందులను గమనించి వారికి డ్రోన్ పరికరం యొక్క సేవలను అందుబాటులోకి తేవడానికి చేసే ప్రయత్నాన్ని పలువురు రైతులు అభినందించారు. కూలీల బెడదతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి యువ రైతులకు బ్యాంకుల ద్వారా రాయితీలను కలిగించి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా రైతాంగానికి డ్రోన్ పరికరం యొక్క సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ మరియు గ్రామ రైతులు కంది మల్లేష్, అల్లం సాయిలు, కొండ హన్మండ్లు, బాన్సువాడ విట్టల్, తర్ణం గంగులు, అనుసూరి శ్రీనివాస్, కూని సాయా గౌడ్, కృష్ణ, మామిడి భూమయ్య, యువ రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








