V1News Telangana

best news portal development company in india

ఖని రౌడీ షీటర్ల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

SHARE:

ఖని రౌడీ షీటర్ల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం సెప్టెంబర్ 22:-

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లను ఆకస్మిక తనకి నిర్వహించారు. రౌడీ షీటర్ లను ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య సమయంలో వారి ఇండ్లలో  తనిఖీ నిర్వహించారు. రౌడీ షీటర్ గా నమోదు చేయబడిన వారి యొక్క ప్రస్తుత నడవడిక, ప్రవర్తన, వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం  రౌడీ షీటర్ ఇళ్లను చెక్ చేసి వాళ్ల దగ్గర ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే కత్తులు గాని, పేలుడు పదార్థాలు గాని, గంజాయి గాని, డ్రగ్స్ గాని,ఇతర వస్తువులు ఏమైనా ఉన్నయా అని చెక్ చేయడం జరిగింది. అనంతరం వారితో మాట్లాడి మంచి ప్రవర్తనతో ఉండాలని ఎలాంటి చట్ట వ్యతిరే కార్యక్రమాల్లో పాల్గొన్న చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిపైన నిరంతరం నిఘ ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జి డి కె 1 టౌన్ పి ఎస్ కు చెందిన సీఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ ఎస్సైలు రమేష్, భూమేష్ మరియు 30 మంది సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india