Post Views: 109
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శనివారం రోజు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి మరియు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి దీపా దాస్ మున్షి మరియు మహేష్ కుమార్ గౌడ్ లను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








