V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ గుర్తింపు లేని” వేద వాహిని” పాఠశాలను మూసివేయాలి…..

SHARE:

-జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి కి వినతి పత్రం అందజేత

-విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న విద్యాసంస్థ

-SFI జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్

V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలో గల” వేద వాహిని”పాఠశాలకు ప్రభుత్వం నుండి గుర్తింపు మరియు ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ యదేచ్చగా పాఠశాలను కొనసాగిస్తున్నారు అని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( SFI) కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎస్ అజయ్ కుమార్ ఆరోపించారు. పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం ఆటలాడుకుంటుందని అన్నారు. విద్యార్థులు చదివిన చదువుకు విలువ లేకుండా పోతుంది.. కనీస మూలిక సదుపాయాలు కల్పించకుండా పాఠశాలను కొనసాగిస్తున్న యాజమాన్యంపై ప్రభుత్వం మరియు సంబంధిత శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి ( MEO) కు ఫిర్యాదు చేయగా స్పందించడం లేదని వాపోయారు. శుక్రవారం రోజు బాన్సువాడ లో సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ని కలిసి పాఠశాలపై ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి పాఠశాలపై శాఖా పరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పాఠశాలను కొనసాగకుండా ఆదేశాలు జారీ చేయాలని సబ్ కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో (SFI) జిల్లా కార్యదర్శి ఎస్. అజయ్ కుమార్, మండల అధ్యక్షుడు షేక్ ఫిర్దోస్ లు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india