V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామంలో శుక్రవారం రోజు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అంకోల్ గ్రామ యూత్ ఆధ్వర్యంలో “మెడికవర్ హాస్పిటల్”వారి సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి సౌందర్య ప్రారంభించారు. మెడి కవర్ హాస్పిటల్ డాక్టర్ విష్ణువర్ధన్ దాదాపు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించారు. ఈ క్రమంలో అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని.. అదేవిధంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకోల్ గ్రామ యూత్ అధ్యక్షుడు చందూరి హన్మండ్లు మాట్లాడుతూ వర్షాకాలం లో ప్రజలు విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించడానికి మరియు బిపి, షుగర్ వంటి వ్యాధులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి పేద ప్రజలకు వైద్య సహాయం అందించడానికి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించినందుకు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని మరియు గ్రామ యూత్ సభ్యులను గ్రామ ప్రజలు అభినందించి.. కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సౌందర్య, చందూరి హన్మండ్లు గంగారాం, విట్టల్, చరణ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








