V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కె.గంగారం అధ్యక్షతన కార్యదర్శి శ్రీనివాస్, ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ లు మరియు రైతుల సమక్షంలో ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే “మహాజన సభ”ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్, బొమ్మందేవ్ పల్లి, హాజీపూర్ గ్రామాలకు చెందిన రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కె. గంగారం ఆరు నెలల వ్యవధిలో సహకార సంఘానికి వచ్చినటువంటి ఆదాయము మరియు ఖర్చుల లావాదేవీల వివరాలను రైతులందరికీ చదివి వినిపించి వివరించారు. ఈ క్రమంలో రైతులు తమకు గల సందేహాలను చైర్మన్ మరియు కార్యదర్శిలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రైతులు గతంలో మెంబర్ షిప్ డబ్బులు ఖాతాలలో 25000 ఉండగా ప్రస్తుతం పదివేల రూపాయలకు చేరిందని కార్యదర్శిని నిలదీశారు. పలువురు రైతులు తమకు ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదని విషయాన్ని చైర్మన్ కు తెలియజేసి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులలో అసైన్ మెంట్ భూములకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని బ్యాంకు అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంలో చైర్మన్ మరియు కార్యదర్శి చొరవ తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని నసురుల్లాబాద్ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు మరియు బొమ్మందేవ్ పల్లి మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు రైతులకు అసైన్ మెంట్ భూములకు పంట రుణాలు మంజూరు చేయనప్పుడు రైతుల వద్ద నుండి పాత బకాయిలు వసూళ్లు చేసేటప్పుడు మీ ప్రమేయం తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా V1న్యూస్ జిల్లా ప్రతినిధి సహకార సంఘం చైర్మన్ తో ముఖాముఖి నిర్వహించగా పలు విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహదేవ్ విట్టల్ ( డైరెక్టర్), తన బుద్ధి లక్ష్మణ్ (డైరెక్టర్), కె.బస్వా రెడ్డి (డైరెక్టర్),( రైతులు) చుంచు నారాయణ, బాబా గౌడ్, కమ్మరి వెంకన్న చారి, పవన్ గౌడ్, శివప్రసాద్, వనం వెంకటేశ్వరరావు, లింగమయ్య, నిజ్జని సాయిలు, గూళ్ళ శంకర్, రెడ్డి శ్రీనివాస్, అన్నారం గంగాధర్, అయినాల పోచయ్య, భోధనం గంగారం, కాశీరాం, మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








