V1News Telangana

best news portal development company in india

*నూతన నేరన్యాయ చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి : పోలీస్ కమీషనర్ వెల్లడి*

SHARE:

నేడు బోర్గం బ్రిడ్జి వద్ద గల భూమారెడ్డి కన్వన్షన్ మిని ఫంక్షన్ హల్ యందు ” *నూతన నేరన్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం” నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్*., గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ జులై 1వ తేదీ నుండి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు – 2023 అమలులోకి వచ్చిన తరుణంలో పలుకేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటిస్తున్న నూతన విధానాల మీద మీడియా మిత్రులకు అవగాహన కల్పించేందుకు
???? *భారతీయ న్యాయ సన్నిహిత*
???? *భారతీయ నాగరిక్ సురక్ష సంహిత*
???? *భారతీయ సాక్ష్య అధినియం*
లకు సంబంధించిన పలు చట్టాల న్యాయ శాస్త్ర గ్రంధాలలో గల ప్రతీ అంశాల గురించి క్షణ్ణంగా తెలియజేయడం జరిగింది.

ఈ అవగాహణ కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింటు ప్రజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది.
*ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు గల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది*.

ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్ ) శ్రీ కోటేశ్వర రావ్, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శ్రీ శంకర్ నాయక్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, స్పెషల్ బ్రాంచ్, ఎ.ఆర్, ట్రాఫిక్, సి.సి.ఆర్.బి ఎ.సి.పిలు శ్రీ రాజావెంకట్రెడ్డి, శ్రీ బస్వారెడ్డి ,శ్రీ శ్రీనివాస్, శ్రీ శ్రీనివాస్ రావు, శ్రీ నాగయ్య, శ్రీనారాయణ, శ్రీ రవీంధర్ రెడ్డి మరియు సి.ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india