V1News Telangana

best news portal development company in india

పాత పగలె కొట్లాటలకు కారణం….. చట్టవ్యతిరేక పనులు చేసే నేరస్తుల తాటతీస్తానన్న గోదావరిఖని సీఐ ఇంద్రసేనారెడ్డి 

SHARE:

పాత పగలె కొట్లాటలకు కారణం

చట్టవ్యతిరేక పనులు చేసే నేరస్తుల తాటతీస్తానన్న గోదావరిఖని సీఐ ఇంద్రసేనారెడ్డి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం సెప్టెంబర్ 16:-

సోమవారం గోదావరిఖని ప్రాంతంలో గణేష్ విగ్రహ నిమర్జనం ఊరేగింపు కార్యక్రమంలో అడ్డగుంటపల్లి రామాంజనేయ బార్ దగ్గర జరిగిన గొడవలో గాంధీనగర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు ఇందిరానగర్ కాలనీకి చెందిన వ్యక్తులపై దాడి. గత మూడు సంవత్సరాల నుంచి పాత పగలను మనసులో పెట్టుకొని నిమజ్జనం సందర్భంలో దాడికి పాల్గొనట్లు విశ్వసనీయమైన సమాచారం. ఈ దాడిలో గాయపరిచిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి మంగళవారం దాడిలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపించనున్నట్లు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వారి వ్యక్తిగతలను మనసులో పెట్టుకొని గాంధీనగర్ కు చెందిన మణికంఠ, అరుణ్ , మరో ఇద్దరు వ్యక్తులు, కేసీఆర్ కాలనీకి చెందిన మహేందర్ అనే వ్యక్తితో కలిసి అడ్డగుంటపల్లిలోని రామాంజనేయ బార్ దగ్గర ఇందిరానగర్ కు చెందిన విష్ణు, మరో ఇద్దరి పైన దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకొని వెంటనే వారిపై హత్య ప్రయత్నం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపడం జరుగుతుందని తెలియజేశారు. ఖని యువత చెడు వ్యసనాలకు మత్తుకు అలవాటు పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ ఈ సందర్భంగా సిఐ తెలియజేశారు. నేరస్తులపై ప్రతినిత్యం ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఇలాంటి సంఘటనలు కాకుండా చూసుకుంటామని తెలిపారు. నేరస్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా తక్షణమే చట్టప్రకారం వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరస్తుల చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వ్యక్తులపైన నిరంతర నిఘా కొనసాగుతుందని వారికి కఠిన శిక్షలు పడే విధంగా పనిచేస్తామని అందరూ చట్ట ప్రకారం నడుచుకోవాలని తెలియజేశారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india