V1News Telangana

best news portal development company in india

ఘనంగా భక్తులతో వీడ్కోలు అందుకొని గంగమ్మ దరికి చేరిన గణనాథుడు…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం 11వ రోజు సందర్భంగా యువజన గణేష్ మండలి, సూర్య గణేష్ మండలి, యువసేన గణేష్ మండలి ఆధ్వర్యంలో.. గణనాధుని ప్రతిమలను గ్రామ ప్రజలు పురుషులు, మహిళలు.. యువకులు, పిల్లలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటపాటలతో, కోలాటం నృత్యాలతో ఒకే రకమైన దుస్తులను ధరించి అంగరంగ వైభవంగా గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. 11 రోజులపాటు పవిత్రమైన పూజలు అందుకున్న లడ్డు ప్రసాదం , సేపు, డబ్బుల హారం, పట్టు శాలువా లను భక్తులు వేలం పాటలో పోటీపడి కైవసం చేసుకున్నారు. లడ్డు వేలం అనంతరం డీజే చప్పుళ్ళు మరియు ఆటపాటలతో విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం గ్రామంలో గల చెరువులో నిమజ్జనం నిర్వహించారు. గంగమ్మ ఒడిలోకి గణనాథుడు ప్రశాంతంగా చేరుకున్నాడు. గ్రామ ప్రజలను మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా కాపాడాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కూనిసాయ గౌడ్, భోధనం హరీష్, శ్రావణ్ గౌడ్, అయినాల లింగం, అల్లం సాయిలు, గైని సాయికుమార్ ,మధు, తర్ణం శ్రీనివాస్, మంగలి సాయికుమార్, రాఘవ, నర్సింలు గౌడ్, గడ్డం సాయి, పసుపు సాయికుమార్, కేతావత్ రవి, గూడెం రవి, దొంతి భాస్కర్, టేకుర్ల సాయిలు, వాసు, మహేష్, శ్రీకాంత్, నాని, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india