V1News Telangana

best news portal development company in india

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం మరియు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను నిర్వహించిన భారతీయ జనతా పార్టీ మండల నాయకులు…..

SHARE:

-నిజాం రాజులు, రజాకారుల పాలనలో తెలంగాణ ప్రజలు బానిసలుగా అణచివేతకు గురయ్యారు

-తెలంగాణ విమోచనం విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివి

-బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మాట్లాడుతూ నిజాం రాజుల నిరంకుశ, విశ్రుంకలత్వానికి, రజాకారు రౌడీల దాష్టీకానికి, బానిస బతుకుల కన్నీళ్లకు, మువ్వన్నెల పతాకం నీడలో స్వేచ్ఛ వాయువులు పీల్చిన సుదినం తెలంగాణ రాష్ట్రం విమోచన దినోత్సవం గా జరుపుకుంటున్నామని అన్నారు. నిజాం రాజుల పరిపాలనలో అప్పటి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. తెలంగాణ మహిళలను వివస్త్రలుగా మార్చి బతుకమ్మలను ఆడించి రాక్షస ఆనందం పొందారని మండిపడ్డారు. అప్పటి భారతదేశ కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం రాజుల ఆట కట్టించి తెలంగాణ విమోచనం గావించి.. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసి ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే విధంగా కృషి చేసినందుకు ఉక్కు మనిషిగా పిలవబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేము అని అన్నారు. అదేవిధంగా భారతదేశ ప్రధాని, విశ్వ గురువుగా పేరుపొందిన నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకొని ఆనందంగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓ బి సి జిల్లా కార్యదర్శి వడ్ల సతీష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు, బిజెపి మండల ఉపాధ్యక్షుడు అనుసూరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గొడిసెల యాదగిరి గౌడ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శేఖర్, బూత్ అధ్యక్షులు పవన్, రాజు, కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, సాయన్న,ఉల్లెంగ చిన్న పర్వయ్య,పెర్క రాములు, గంగాధర్ గుప్తా, అరిగె నారాయణ,మంగలి అశోక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india