V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు 9వ రోజు సందర్భంగా విశ్వహిందూ పరిషత్ గణేష్ మండలి మరియు బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథులను నిమజ్జనం చేసే క్రమంలో గ్రామ ప్రజలు, పురుషులు మరియు మహిళలు, చిన్నపిల్లలు అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి విఘ్నేశ్వరుడిని గ్రామంలో గల వీధుల గుండా ఆటపాటలతో ,కోలాటం నృత్యాలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజులపాటు పవిత్రమైన పూజలు అందుకున్న మహా ప్రసాదం లడ్డు, సేపు మరియు విఘ్నేశ్వరుడి మెడలో ధరించిన డబ్బుల హారం, పట్టు శాలువా భక్తులు వేలం పాటలో పాల్గొని పోటీపడి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ గణేష్ మండలి ప్రధాన సలహాదారుడు కూని మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు పూజా కార్యక్రమాలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించమన్నారు. డీజే వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కోలాటం నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించి విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ విగ్నేశ్వరుడి కృపాకటాక్షాల వల్ల గ్రామ ప్రజలు, పాడిపంటలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, అల్లం సాయిలు, అల్లం రవి, చుంచు శేఖర్, డోన్ గావ్ విట్టల్ , గునిగెరి రవి, సల్ల రాజు, నరేష్, భోధనం సాయిలు, మాడ అశోక్, బాన్సువాడ విట్టల్, మాడ రమేష్, బాన్సువాడ మధు, కర్ణం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








