V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయకుడి నిమజ్జనం శోభాయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం రోజు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ లు పరిశీలించారు. పట్టణంలో గల రైల్వే స్టేషన్ రోడ్డు, నిజాంసాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు శోభాయాత్ర సమయంలో విగ్రహాలకు ఆటంకం కలిగించకుండా మార్గాలను అనుకూలంగా సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు శోభాయాత్ర మార్గాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది మరియు పలు శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








