V1News Telangana

best news portal development company in india

ఘనంగా త్రిశూల్ గణేష్ మండలి వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో 5వ రోజు త్రిశూల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వినాయకుడిని గ్రామంలో ఊరేగించడానికి రథాన్ని రంగురంగు పూలతో అలంకరించారు. కమిటీ సభ్యులు పురుషులు, మహిళలు, పిల్లలు అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి చేతిలో ఐదు రోజులపాటు పవిత్రమైన పూజలు అందుకున్న మహా ప్రసాదం లడ్డు ను వేలంపాట నిర్వహించగా అడుసుమిల్లి సుధాకర్ రూ .22,500, సేపు రూ.2200 తరుణ్ (పొతంగల్), డబ్బుల హారము రూ.4500 ( గోపాల్, భూమయ్య), శాలువా రూ.2500 గంగారెడ్డి (నిజామాబాద్) లు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వేలం పాటలో స్వామివారి ప్రసాదాన్ని కైవసం చేసుకున్న వారిని ఘనంగా సన్మానించారు. కమిటీ సభ్యులకు సౌండ్ సిస్టం బహుకరించినందుకుగాను దాత రాజేశ్వర్ రెడ్డి మరియు విజయ దంపతులను వారు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వినాయకుడిని గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అందరూ ఎంతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొని స్వామివారిని గ్రామంలో గల చెరువులో పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో త్రిశూల్ గణేష్ మండలి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india