Post Views: 78
V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని చించొల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త నర్రం గంగాధర్ యొక్క తండ్రి సోమవారం రోజు స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాన్సువాడ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. నర్రం గంగాధర్ తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు దామరంచ సర్పంచ్ విట్టల్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు శివ సూరి, నవీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








