V1News Telangana

best news portal development company in india

ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించుకున్న ఫరియా ఖషఫ్…..

SHARE:

-చిన్నారి చిన్న వయసు నుండి కెసిఆర్ మరియు పార్టీపై అభిమానం పెంచుకోవడం సంతోషం

-భవిష్యత్తులో గొప్ప నాయకురాలిగా ఎదగాలని అభినందనలు

-మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన యం.డి అఫ్రోజ్ (బిఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ యువ నాయకులు) కుమార్తె ఫరియా ఖషఫ్ తన జన్మదిన వేడుకను బుధవారం రోజు తల్లిదండ్రులు, బంధువులు మరియు గ్రామస్తుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. చిన్న వయస్సు నుండి కెసిఆర్ మరియు పార్టీ పైన ఎంతగానో అభిమానం, గౌరవం మరియు ఆప్యాయత కలిగి ఉండడం చాలా సంతోషమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరపున నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆ చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు అని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించి భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప నాయకురాలిగా ఎదిగి ప్రజాసేవలో పాలు పంచుకోవాలని కొనియాడారు. అదేవిధంగా చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు పోస్ట్ చేయడం జరిగిందని జుబేర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india