V1News Telangana

best news portal development company in india

విష సర్పంతో విన్యాసాలు ఆడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు……

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:బాన్సువాడ మండలం దేశాయి పేట్ గ్రామానికి చెందిన మోచే శివరాజు ( 18) విష సర్పంతో విన్యాసాలు ఆడి మృతి చెందిన సంఘటన శుక్రవారం రోజు వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే మృతుడి తండ్రి మోచే గంగారం సర్పాలను పట్టేవాడని ఆ విద్యను తన కుమారుడికి కూడా నేర్పించాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం రోజు తండ్రి నాగు పామును పట్టి తన కుమారుడి చేతికి అందించాడు. శివరాజు ఏకంగా పాము తలను నోట్లో పెట్టుకుని సామాజిక మాధ్యమంలో ప్రాచుర్యం పొందడానికి ఆకతాయితనంతో, అత్యుత్సాహం ప్రదర్శించాడు. చివరికి పాము కాటుకు గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాల్సిన తండ్రి నిర్లక్ష్యపు వైఖరి వలన పాము చేతిలో నిండు ప్రాణాలు బలైపోయాయి. యుక్త వయసులో ఉన్న శివరాజు మృతి చెందడం పట్ల బంధువులు మరియు గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india