V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో రుణమాఫీ కాకపోవడం వలన మండలంలోని పలు గ్రామాల కు చెందిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తులను అందించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మాకు రుణమాఫీ కాలేదని వెళ్లి వ్యవసాయ శాఖ అధికారులను గాని బ్యాంకు సిబ్బందిని గాని వెళ్లి అడిగితే వివిధ రకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాకపోవడం వలన తమపై వడ్డీల భారం పడుతుందని, పంటల పెట్టుబడికి తిరిగి అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తమ గోడును వెలబోసుకున్నారు.పంటలను వదిలి కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతులు రుణమాఫీ కాని వారు కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని తెలిపారు. దరఖాస్తులను సేకరించి వివరాలను ప్రభుత్వానికి నివేదిక తయారుచేసి పంపిస్తామని అన్నారు. కొంతమందికి సాంకేతిక సమస్యల వలన పేరులో తప్పులు ఉన్నట్లయితే మరియు కొంతమందికి రేషన్ కార్డులో ఉన్న లోపాల వలన రుణమాఫీ జరగలేదని తెలిపారు. రూపాయలు రెండు లక్షల పైచిలుకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం నుండి ఇంకా ఖచ్చితమైన ఉత్తర్వులు రాలేదని తెలిపారు. ప్రస్తుతానికి రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ ఏఈఓ గోపాల్ మాట్లాడుతూ పిఎం కిసాన్ డబ్బులు ఖాతాలో పడడం లేదని కొంతమంది రైతులు మమ్మల్ని సంప్రదిస్తున్నారని దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన లబ్ధిదారులకు ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న ఏదో ఒక బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని వాటిని రైతులు అవగాహన లేకపోవడం వలన పరిశీలించుకోవట్లేదని తెలిపారు. అటువంటి సమస్య ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








