V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా అంగన్వాడి కేంద్రంలో తనిఖీలు నిర్వహించి.. పిల్లలతో కాసేపు ముచ్చటించి రికార్డులను పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని.. ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడినట్లయితే జాప్యం చేయకుండా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి గాని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గాని పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధం పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం వంటశాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడి విద్యార్థులకు అందించే భోజనం మెనూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సబ్ కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటి వాటికి నీరు అందించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఇంచార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్, ఆర్ఐ హన్మండ్లు, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ వాణి, మెడికల్ ఆఫీసర్ గిరీష్, ఎంఈఓ నాగేశ్వరరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హన్మండ్లు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








