V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సొసైటీ చైర్మన్ రామకృష్ణ గౌడ్ బుధవారం రోజు అకాల మరణం చెందారని విషయం తెలుసుకుని.. మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ప్రమర్శించి ఓదార్చారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.. వారి కుటుంబానికి తాను మరియు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ (నందు) రెడ్డి, ద్రోణవల్లి సతీష్, పాత బాలకృష్ణ, అరిగె సాయిలు, అయినాల లింగం, శివప్రసాద్, యూసుఫ్, శంకర్ నాయక్ , ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








