V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ పట్టణంలో గల వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్…..

SHARE:

-పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు రాబట్టాలి

-విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

-ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

-కల్కి చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు రాబట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం రోజు ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పాఠశాలలోని వంటశాలను మరియు మరుగుదొడ్లను పరిశీలించారు. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో 75 శాతం రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటి గురించి విద్యార్థులకు ఇప్పటినుండే అవగాహన కల్పించాలని, అందులో చేరితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్ధినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సిబ్బంది హాజరు రిజిస్టర్లను మరియు పిల్లల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడి నుండి మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని కల్కి చెరువు మరియు ఉద్యానవనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు, తహసిల్దార్ వరప్రసాద్, ఎంఈఓ నాగేశ్వరరావు, ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ డీఈ జగదీష్, ఏఈ గజానంద్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india