V1News Telangana

best news portal development company in india

శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు…..

SHARE:

-పొలాల అమావాస్యను పురస్కరించుకొని నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

-శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటించిన ప్రజలు

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా శ్రావణమాసం చివరి సోమవారం మరియు ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర ఆలయంలో మరియు దుర్కి సోమలింగేశ్వర శివాలయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి సోమవారం రోజు ఉదయం నుండి భక్తులు పంచామృతాలతో అభిషేకాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ధూప ,దీప, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india