V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు. రైతుల పాలిట బాంధవుడుగా ఆయన సేవలందించాలన్నారు.ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ (నందు) రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం, గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, మంతపురి సాయ గౌడ్, శివప్రసాద్, యూసుఫ్, సాయిలు, గంగారాం, షకీల్, మహమ్మద్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








