Post Views: 95
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: టీజేఏ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాన్సువాడ పట్టణానికి చెందిన జపాల పాండురంగ శర్మ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదివారం రోజు నియమించారు. ప్రెస్ క్లబ్ బాన్సువాడ ప్రధాన కార్యదర్శిగా కూడా జపాల పాండురంగ శర్మ విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాండురంగ శర్మ మాట్లాడుతూ జిల్లాలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మరియు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకుగాను జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








