V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహించిన మమత అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం గత మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. మమత హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. ప్రేమించిన ప్రియుడు (ప్రశాంత్) మమతను హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించి లొంగిపోయాడు. ఆదివారం రోజు బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ విడుదల చేసిన ప్రకటనలో విషయాలను తెలియజేశారు. మమత మరియు ప్రశాంత్ అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని పెళ్లి విషయంలో జరిగిన గొడవతో ప్రశాంత్ మమతను అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








