V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావ్…..

SHARE:

-వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

-సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు మరియు వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

-వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

-జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్పిన తోట లక్ష్మీకాంతరావ్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు తదితర వివరాలను ప్రజలను మరియు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పారిశుద్ధ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రోజు తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలను పాటించాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ప్రాణాంతక వ్యాధులు సోకి ప్రజలు మరణిస్తున్నారని గుర్తు చేశారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధుల పట్ల ప్రజలు మరియు వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ వ్యాధులు సోకినట్లయితే కావాల్సిన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు రోగుల పట్ల దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్యానికి అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసే విధంగా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందని తెలియజేశారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని సమస్యలను, మౌలిక వసతుల కల్పనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అంకితభావం మరియు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం పట్ల ప్రజలు మరియు వైద్య సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india