V1News Telangana

best news portal development company in india

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో మొట్ట మొదటి ఆగ్రో ఇండస్ట్రీ ఏర్పాటు కు శంకుస్థాపన…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివానగర్ మండలం లింగంపల్లి గ్రామంలో( TSIIC) ఇండస్ట్రియల్ జోన్ లో వివేక్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ నిర్మాణానికి శనివారం రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావ్ మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటి ఆగ్రో ఇండస్ట్రీ ఏర్పాటు కావడంలో భాగస్వామ్యం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభినందనలు తెలిపారు. తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇండస్ట్రీలు నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కలిపిస్తాను అని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 2023 ఎన్నికలో ఇచ్చిన హామీ గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు లింగంపల్లి గ్రామం (TSIIC) ఇండస్ట్రియల్ జోన్ లో వివేక్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది అని అన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో నియోజకవర్గంలో గల నిరుద్యోగ యువతకు దాదాపు 250 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విషయం ప్రజలకు గుర్తు చేశారు. నేటి వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 30 వేల మంది రైతులకు దాదాపు 205 కోట్లు మేర రుణమాఫీ జరిగింది అని తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో 300 మంది ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రాబోయే 10 రోజుల వ్యవధిలో డబుల్ బెడ్రూం ఇల్లు అందిస్తాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎంపీ సురేష్ శెట్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు
MLA క్యాంప్ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india