V1News Telangana

best news portal development company in india

విద్యార్థి సంఘం నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన బాన్సువాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్….

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు గడ్డమీది ప్రవీణ్ గౌడ్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ తన సహచర నాయకులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారిలో మనో ధైర్యాన్ని నింపి.. ప్రవీణ్ గౌడ్, విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యల పట్ల ఎన్నో ఉద్యమాలు చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో చిన్న వయసులో మృతి చెందడం పట్ల వారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందరితో స్నేహపూర్వకంగా మెదిలేవాడని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్బర్, యూనుస్, సుదర్శన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india