V1News Telangana

best news portal development company in india

పిడుగుపాటుకు గురైన వ్యక్తికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామానికి చెందిన జవాన్ కిమ్యా నాయక్ రోజు మాదిరిగా పశువులను మేపడానికి అడవిలోకి వెళ్ళాడు. శనివారం రోజు ఉరుములు మెరుపులతో కూడి ఎడతెరిపి లేకుండా కురిసిన తీవ్ర వర్షం కారణంగా పిడుగుపాటుకు మంటలు చెలరేగడం వలన ఒళ్ళు కాలిపోయి తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో కనిపించడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు అంబులెన్స్ సిబ్బంది ప్రసాద్ మరియు పుండరీకం లను అభినందించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india