V1News Telangana

best news portal development company in india

ఎస్సీ, ఎస్టి వర్గీకరణ వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో “భారత్ బంద్” సందర్భంగా భారీ ర్యాలీ మరియు రాస్తారోకో నిర్వహణ …..

SHARE:

-“వర్గీకరణ వద్దు – కలిసి ఉంటేనే ముద్దు”

-రాజకీయ శక్తులు విభజించి పాలించాలని కుట్రలు పన్నుతున్నారు

-సరైన న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తాం

-అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఉల్లెంగ బాల సాయిలు

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి జాతీయ కమిటీ పిలుపుమేరకు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు “భారత్ బంద్” లో భాగంగా ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ పై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎస్సి, ఎస్టీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నసురుల్లాబాద్ మండల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం కమిటీ నాయకులు మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక సమితి నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, వ్యాపార సముదాయాలు, కిరాణా షాపులు, హోటల్లు, పెట్రోల్ బంకులు, వైన్సు షాపులు అన్నింటిని బంద్ చేయించారు. ప్రధాన రహదారి గుండా శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించడం వలన వందల సంఖ్యలో వాహనాలు నిలిచి పోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బంద్ ప్రక్రియ ప్రశాంతంగా ముగించారు. ఈ సందర్భంగా నస్రుల్లాబాద్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఉల్లెంగ బాల సాయిలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మేము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. రాజకీయ శక్తులు మమ్మల్ని విభజించి పాలించాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. “వర్గీకరణ వద్దు కలిసి ఉంటేనే ముద్దు”అనే నినాదంతో ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు మా విన్నపాన్ని మన్నించి మరొక్కసారి పునరాలోచన చేసి మాకు న్యాయం జరిగే విధంగా సరైన తీర్పు విలువరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా “భారత్ బంద్” కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పందించి సరైన న్యాయం జరగనట్లయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు గైని పోశెట్టి, ప్రచార కమిటీ అధ్యక్షుడు దరఖాస్తుల శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మామిడి భూమయ్య, మండల కమిటీ ముఖ్య సలహాదారులు గైని శ్రీనివాస్, గౌరీ నరసింహులు, ఉల్లెంగ చిన్న సంగయ్య, మహేష్, సాయికుమార్, ఉల్లెంగ కిరణ్ కుమార్, దుర్కి శ్రావణ్, బొమ్మన్ దేవ్ పల్లి లింగమయ్య, సంగం సాయిలు, మిర్జాపూర్ బాలరాజు, హాజీపూర్ సంజీవ్ మరియు వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘం కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి లు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india