V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో వెలసి తెలంగాణ శిరిడీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సాయి బాబా మందిరంలో గురువారం రోజు శ్రావణమాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తద్వారా ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో సందడిగా నెలకొంది. దూర ప్రాంతాల నుండి భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తిశ్రద్ధలతో మరియు ఉపవాస దీక్షలతో కొంతమంది భక్తులు కాలినడకన బాబాను దర్శించుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మేనేజర్ పోతారెడ్డి మరియు కౌంటర్ సెక్షన్ ఇన్చార్జ్ రామిరెడ్డి మాట్లాడుతూ ఆలయ ధర్మకర్త పట్లోళ్ల మోహన్ రెడ్డి కృషి వల్ల నెమ్లి గ్రామంలో మందిరం నిర్మాణం జరిగిందని అన్నారు. 2009 సంవత్సరంలో ఆలయం నిర్మాణం జరిగిన నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల మదిలో బాబా నిలిచిపోయారని తద్వారా స్థానిక గ్రామాల ప్రజలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయాన్ని సందర్శించి బాబాను దర్శించుకుని వెళ్తున్నారని తెలిపారు. ఆలయంలో సంతానం కలగని వారు దునిచుట్టు కొబ్బరికాయ తో పాటు ప్రదక్షిణలు చేసి అనంతరం కొబ్బరికాయలు దునిలో వేసి బాబాను సంతాన ప్రాప్తి కలగాలని కోరుకుంటున్న భక్తులకు సంతానం కలుగుతుందని భక్తులు వారి అనుభవాలను తెలిపిన విషయాలను వారు తెలియజేశారు. భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ కొంగుబంగారంగా విరాజిల్లుతున్నదని కొనియాడారు. ఆలయ ప్రాంగణంలో పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంవల్ల భక్తులు చాలా సమయం ఆలయ ప్రాంగణంలో కేటాయించి సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరియు ప్రాంగణంలో పంచముఖ శివాలయం నిర్మించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సేవకులు బాలరాజ్, నాగరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








