V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత మండల కార్యాలయ భవనం ప్రాంగణంలో మండల తహసీల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్ మరియు మండల ప్రత్యేక అధికారి దయానంద్ ల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏ.ఎస్.ఐ ఆబిద్ బేగ్ మరియు కానిస్టేబుల్ ల బృందం జాతీయ పతాకానికి పోలీసు గౌరవ వందనం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మరియు మండల ప్రత్యేక అధికారి ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా చాలామంది యువకులు విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువకులందరూ దేశభక్తిని పెంపొందించుకొని శ్రద్ధతో విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలలో మరియు వ్యాపార రంగంలో రాణించాలని అన్నారు. యువత ధైర్యంగా వ్యక్తిగతంగా పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపాధితో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన పరిశ్రమల ఏర్పాటు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అందరూ దేశాభివృద్ధి కొరకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, ఆర్ ఐ హన్మండ్లు, ఇన్చార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్, గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్, శివ ప్రసాద్, చుంచు పెద్ద సాయిలు, మైషా గౌడ్, ఖలీల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








