V1News Telangana

best news portal development company in india

అంగన్వాడి స్కూల్ పిల్లలకు పడుకోవడానికి మ్యాట్లు బహుకరించిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు…..

SHARE:

-చిన్నపిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

-వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి

-కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలో గల రెండు అంగన్వాడి పాఠశాలల్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ గ్రామ యువకులతో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన సేవా దృక్పథంతో అంగన్వాడి పాఠశాల ఉపాధ్యాయులకు చిన్న పిల్లలకు పడుకోవడానికి ఉపయోగపడే విధంగా వారికి అవసరం నిమిత్తం తాను వ్యక్తిగతంగా కొనుగోలు చేసి మ్యాట్ లు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మరియు భారతీయులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ తెలియజేశారు. చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మంచి విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. మ్యాట్ లు బహుకరించడం పట్ల అంగన్వాడి పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో అందరూ ఇదే విధంగా సేవా దృక్పథం కలిగి ఉండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అతనితోపాటు బంగారం బాలరాజ్, కమ్మరి శివుడు, కాల గడ్డ సాయి, నాయిని శ్రీకాంత్, కాల గడ్డ రమేష్, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india