V1News Telangana

best news portal development company in india

రాణంపల్లి గ్రామంలో భారీ కుంభకోణం…. 30 లక్షలకు పైగా అవకతవకలు….

SHARE:

..V1 న్యూస్ బ్యూరో ఇర్ఫాన్ :రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామం రానంపల్లి ఈ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లి కూలి పైసలు ఖాతాలో వెయ్యకుండా వేరే వారిని సృష్టించి మరి ఆ డబ్బులను పక్కదో పట్టించడం జరిగిందని ..

ఈరోజు రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట జరిగిన సోషల్ అడిక్ట్ కార్యక్రమంలో రాణంపల్లి గ్రామస్తులు తెలిపారు. రానంపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు ఉపాధి హామీ కొందరు అధికారులు ఈ అవినీతికి పాల్పడినట్టు గ్రామస్తులు సాక్షాలతో సహా సోషల్ అడిక్ట్ అధికారుల ఎదుట సమర్పించారు. కొత్త జాబ్ కార్డులు ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం ఒకరి ఖాతాలో డబ్బులు మరొకరికి వేయడం. సొమ్మొకడిది సోకొకడిది అనే విధంగా ఒకరి పేరు పెట్టి ఆయనకు బదులు వేరే వ్యక్తి బ్యాంకు అకౌంట్ ను ఎడిట్ చేసి అవినీతికి పాల్పడడం జరిగింది. మరి చర్యలు తీసుకుంటామన్న సోషల్ అధికారులు గతంలో కూడా ఇదే విధంగా మాట వరసకు చెప్పి వెళ్లిపోయారని ఒక రోజు ముందే సోషల్ అడిక్ట్ వాళ్లకు మరియు ఉపాధి హామీ అధికారులకు మధ్య ఓ సంభాషణ జరిగినట్టు కొందరు సీసీటీవీలో ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. అధికార వ్యవస్థ పైన ప్రజలకు ఉన్న నమ్మకమే ప్రజాస్వామ్యం అలాంటి ప్రజాస్వామ్యంలో అధికారులు సొమ్ముకు ఆశపడి వారి కష్టానికి ఫలితం ఇవ్వకుండా దోచుకోవడమే కాకుండా వచ్చిన అధికారులను సైతం దించే పనిలో ఉన్నారని తమకు న్యాయం కావాలని న్యాయం దొరకనియెడల పై స్థాయి వరకు వెళ్తామని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని రానంపల్లి గ్రామస్తులు తెలిపారు.ప్రజసామ్యపు దేశంలో న్యాయం అనే మాటలు నిజమేనని నీరుపిస్తామని అవినీతి చేసిన వారు ఎంతటి వాలైనా సరే వాళ్లకు శిక్ష పడేంత వరకు తము ఊరుకోమని రానంపల్లి గ్రామస్తులు మండిపడ్డారు. ఎంపీడీవో కార్యాలయంలో చేస్తున్న ఎపిఓ ఉపాధి హామీ అంతటికి ఈనే బాస్ గా ఉంటాడు. మండల కేంద్రంలోని రానంపల్లి గ్రామంలో దాదాపు ముపై లక్షలకు పైగా అవినీతి జరిగిన ఈయనకేం తెలియనట్టు వ్యవహరించడం సిగ్గుచేటని ఆయనకు తెలవకుండా జాబ్ కార్డు ఎలా అమోదించబడుతుందని అంతా అందరు కలిసికట్టుగా చేసిన వ్యూహమని ప్రభుత్వ కార్యాలయం సమయము సాయంత్రము 5 నుండి 6 గంటల వరకు ఉన్న రాత్రి 11,12 గంటల సమయంలో కూడా జాబ్ కార్డులు చేసి ఇవ్వడం సిగ్గుచేటని. గతంలో ఎంపీడీవో గా ఉన్న బాలగంగాధర్ కు ఎన్నిసార్లు చెప్పిన ఆయన పట్టించుకోలేదని రానంపల్లి గ్రామస్తులు ఆయన పైన మండిపడ్డారు. వ్యవస్థను చీడపురుగుల తినేస్తున్న ఇలాంటి అధికారులు సమాజానికి అవసరమా అంతా తెలిసిన మౌనం పాటిస్తున్న ఇలాంటి ఏపీఓ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సోషల్ అడిక్ట్స్ వాళ్లు వేచి చూడాల్సి ఉంది. నామ మాత్రానికి చేస్తామన్నట్టు లో లోపల కుమ్మక్కై ఎలాంటి మార్గం చూపెట్టకుండా వాళ్లు కూడా న్యాయం చేయకుంటే దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి ప్రజలకు అధికార వ్యవస్థ పై ఉన్న నమ్మకం ఇలాంటి అధికారుల వల్ల కోల్పోతే ప్రజాస్వామ్యపు దేశంలో న్యాయం అనేది అసలుకి కనబడకుండా పోతుంది. రానున్న రోజుల్లో అవినీతి చేసేవాళ్లు ఇంట్లో కెళ్ళి దౌర్జన్యాయం చేసిన తప్పు కాదని చెప్పొచ్చు ఇలాంటి అధికారులు సమాజంలో ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. జిల్లా స్థాయి మరియు రాష్ట్రస్థాయి అధికారులు ఇలాంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి అధికారుల వాళ్ళ అవినీతి జరుగుతుందని ఇలాంటి అధికారులు లేకుంటేనే ప్రజలకు మరియు పేదవారికి న్యాయం కలుగుతుందని కొన్ని వేల కోసం లక్షలో ప్రజలను ముంచుతున్న ఇలాంటి అధికారులు సమాజానికి అవసరమా అని రాణంపల్లి గ్రామస్తులు మండిపడ్డారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india