V1News Telangana

best news portal development company in india

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు కాసుల బాలరాజ్…..

SHARE:

కామారెడ్డి జిల్లా:బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో సోమవారం రోజు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథులుగా మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రో ,ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, రూ. 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించి అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, జ్ఞానాన్ని ఇచ్చే వారు గురువులు అని అన్నారు.విద్య తోనే ప్రతి మనిషికి అభివృద్ధి సాధ్యమని తెలిపారు.బాన్సువాడ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి గత ఆరు సంవత్సరాల కాలంలో రూ.50 కోట్ల వ్యయంతో దాదాపు 350 నూతన భవనాలు, అదనపు తరగతి గదులు మంజూరు చేయించానని తెలిపారు.రూ.12 కోట్ల వ్యయంతో 110 నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించాం అని తెలిపారు.
1994 వ సంవత్సరంలో మొదటిసారి శాసనసభ్యుడిని అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్కటే జూనియర్ కళాశాల ఉండేది అన్నారు. ఇప్పుడు దాదాపుగా ముప్పై కళాశాలలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు.మౌళిక సదుపాయాలు కల్పించడం నా బాధ్యత, విద్య నేర్పించడం గురువుల బాధ్యత అని అన్నారు.ఈ అవకాశాలను ఉపయోగించుకుని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి అని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులను కేటాయిస్తున్నారు అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు అన్నారు.అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డుల జారీ పై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు ప్రజలకు త్వరలోనే అందుతాయి అని తెలిపారు.ఇళ్ళు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటిని మంజూరు చేస్తుందని సూచించారు.
బాన్సువాడ నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.ఈ పథకంలో ఒక్కో ఇంటికి అయిదు లక్షల రూపాయలను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు.ప్రజాప్రతినిధులు, నాయకులు నిజాయితీగా ఉండి అర్హులైన పేదవారికి మాత్రమే ఇండ్లను కేటాయించాలి అని సూచించారు.నిజాంసాగర్ ఆయకట్టులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడానికి ప్రధాన కాలువతో పాటుగా డిస్ట్రిబ్యూటర్ లకు కూడా లైనింగ్ చేయించానని తెలిపారు.ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయని, అయినా అన్ని రకాల ప్రయత్నాలు చేసి వానాకాలం పంటలను బ్రతికిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు,నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india